తెలంగాణ

telangana

ETV Bharat / business

అదానీ గ్యాస్​లో 37.4 శాతం వాటా కొనుగోలు! - అదానీ గ్యాస్​లో వాటా కొనుగోలు వార్తలు

భారత్​లో సహజ వాయువు డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్​ను పెంచుకునే దిశగా అడుగులు వేసింది ఫ్రెంచ్​ ఇంధన దిగ్గజ సంస్థ టోటల్​. అదానీ గ్యాస్​లోని సుమారు 37.4 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 50:50 సంయుక్త వెంచర్​ ప్రకటించిన ఏడాది తర్వాత ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.

అదానీ గ్యాస్​లో వాటా కొనుగోలు

By

Published : Oct 14, 2019, 11:26 AM IST

ఫ్రాన్స్​కు చెందిన ఇంధన దిగ్గజ సంస్థ టోటల్..​ గౌతమ్​ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్​ సంస్థలో 37.4 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. కానీ ఈ ఒప్పందం విలువ ఎంతో బయటకు వెలువరించలేదు.

సహజ వాయువు దిగుమతి, రిటైల్​ అమ్మకంపై రెండు సంస్థలు 50:50 సంయుక్త వెంచర్​ ప్రకటించిన ఏడాది తరువాత ఈ ప్రకటన చేసింది టోటల్​ సంస్థ.

" అదానీ (50 శాతం), టోటల్​ (50 శాతం) మధ్య భాగస్వామ్యంలో రెండు దిగుమతి టెర్మినళ్లు, ధ్రవీకృత సహజ వాయువు (ఎల్​ఎన్​జీ) రీ-గ్యాసిఫికేషన్ టెర్మినల్​తో పాటు పలు ఆస్తులను కలిగి ఉంది. తూర్పు భారత్​లో ధర్మ, దక్షిణ ప్రాంతంలో ముంద్రా, అదానీ గ్యాస్​లు నగర గ్యాస్​ పంపిణీలో ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. అదానీ గ్రూప్ 74.8 శాతం వాటా కలిగి ఉంది. అందులోంచి మేము 37.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్నాం."

- టోటల్​, ఫ్రెంచ్​ ఇంధన సంస్థ.

అదానీ గ్యాస్​లో 37.4 శాతం వాటాను చేరుకునే ముందు సుమారు 25.2 శాతం మేర ఈక్విటీ షేర్లతో పబ్లిక్​ ఇష్యూకి వెళ్లనున్నట్లు తెలిపింది టోటల్​ సంస్థ. భారత సహజ వాయువు మార్కెట్​ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు అదానీ గ్రూప్​లో తన వాటాను పెంచుకుంటున్నట్లు ప్రకటించింది.

2030 వరకు 15 శాతంగా...

భారత సహజ వాయువు మార్కెట్లో స్థిరమైన వృద్ధి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంధన వినియోగంలో 7 శాతంగా ఉంది. కానీ నగరాల్లో గ్యాస్​ వినియోగం, వాహనాల్లో ఇంధనం ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల కారణంగా గత మూడేళ్లలో ఏడాదికి 5 శాతం మేర వృద్ధి నమోదవుతోంది. 2030 వరకు ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 15 శాతంగా ఉండాలనే లక్ష్యం నిర్దేశించుకుంది ప్రభుత్వం.

ఫ్రెంచ్​ నైపుణ్యాలను భారత్​కు..

అదానీ-టోటల్​ సంస్థల భాగస్వామ్యంలో భాగంగా టోటల్​ తన ఎల్​ఎన్​జీ, రిటైల్​ నైపుణ్యాలను భారత్​కు తీసుకువస్తుంది. అదానీ గ్యాస్​కు ఎల్​ఎన్​జీని సరఫరా చేస్తుంది. భారత్​తో పాటు బంగ్లాదేశ్​​లోనూ ఎల్​ఎన్​జీ మార్కెట్​ను విస్తరించేందుకు సంయుక్తంగా వెంచర్​ ఏర్పాటు చేయనుంది.

ఇదీ చూడండి: 'గ్యాస్​ మౌలిక సదుపాయాలకై భారీ పెట్టుబడులు'

ABOUT THE AUTHOR

...view details