జపాన్‌కు చెందిన టెక్‌దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంది. కంపెనీ తన డైనాబుక్ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లో 19.9 శాతం వాటాను షార్ప్ సంస్థకు విక్రయించింది. దీనితో ఈ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగినట్లైంది. గతంలోనే 80.1శాతం వాటాను షార్ప్‌కు విక్రయించింది తొషిబా.
"డైనాబుక్‌లోని మిగిలిన 19.9 శాతం వాటాను కూడా షార్ప్ కార్పొరేషన్‌కు బదలాయించాము. దీనితో అధికారికంగా డైనాబుక్ ఇప్పుడు షార్ప్‌నకు అనుంబంధ సంస్థగా మారింది" - తొషిబా ప్రకటన