తెలంగాణ

telangana

ETV Bharat / business

రివ్యూ 2019: ​​​​​​​ఈ ఏడాది అత్యంత చెత్త పాస్​వర్డ్​లు ఇవే! - టెక్​ వార్తలు

ఇటీవల సైబర్​ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నా.. ఇంకా చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది 10 చెత్త పాస్​వర్డ్​ల నివేదిక చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఓ ప్రముఖ ఐటీ సంస్థ విడుదల చేసిన ఆ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.

Top 10 Worst Passwords of 2019
చెత్త పాస్​వర్డ్​లు ఇవే

By

Published : Dec 26, 2019, 2:52 PM IST

Updated : Dec 26, 2019, 3:07 PM IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో పాస్​వర్డ్​లు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ-మెయిల్​, నెట్ ​బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాలు ఇలా అన్ని ఖాతాలకు పాస్​వర్డ్​లు తప్పనిసరి. వీటిల్లో ఖాతాదారులకు సంబంధించిన విలువైన సమాచారం ఉంటుంది. అందుకే పాస్​వర్డ్​లు ఎంత కఠినంగా ఉంటే డేటా అంత సురక్షితంగా ఉన్నట్లు లెక్క.

అయితే.. ఇంకా చాలా మందికి పాస్​వర్డ్​ల ఆవశ్యకత తెలీదనే విషయాన్ని ఓ ప్రముఖ సంస్థ నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం పాస్​వర్డ్​లను పెట్టుకోవడంలో పెద్దగా మార్పు రాలేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. స్ప్లాష్​డేటా అనే సాఫ్ట్​వేర్​ సంస్థ విడుదల చేసిన.. 2019 ఏడాది.. 10 చెత్త పాస్​వర్డ్​ల జాబితా చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది.

2019- 10 చెత్త పాస్​వర్డ్​లు ఇవే..

1.123456
2.123456789
3.qwerty
4.password
5.1234567
6.12345
7.iloveyou
8.111111
10.123123

వీటిని కనుగొనేందుకు హ్యాకర్లే అవసరం లేదు..

ఈ పాస్​వర్డ్​లన్నీ చిన్నపిల్లలు, ఏ మాత్రం హ్యాకింగ్ గురించి తెలియని వారూ కనిపెట్టేంత సులభంగా ఉన్నాయి. అయితే మీరూ ఇలాంటి సులభతరమైన పాస్​వర్డ్​లు పెట్టుకుంటే.. ఇప్పుడే మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కఠినంగా పాస్​వర్డ్​లు పెట్టుకుంటే.. అందులో ఇంగ్లీష్​లో పెద్ద, చిన్న అక్షరాలు, నంబర్లు, చిహ్నాలు ఉండాలని సూచిస్తున్నారు.

పాస్​వర్డ్​లు మర్చిపోతున్నారా?

కఠినంగా పాస్​వర్డ్​ పెట్టుకుంటే గుర్తుండదు అని చాలా మంది అంటుంటారు. అయితే సులభతరమైన పాస్​వర్డ్​ల వల్ల మీ విలువైన సమాచారం హ్యాకర్లకు ఇవ్వడం కన్నా ఇదే కాస్త ఉత్తమమని చెప్పాలి. రకరకాల అవసరాలకు వేర్వేరు పాస్​వర్డ్​లు పెట్టి గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్లు 'పాస్​వర్డ్​ మేనేజర్'ను వాడటం ఉత్తమం.

అయితే ఇప్పటికే మీరు సులభంగా పెట్టిన పాస్​వర్డ్​ ద్వారా మీ ఈ-మెయిల్​ హ్యాకర్ల చేతికి వెళ్లిందా లేదా అనే విషయాన్ని haveibeenpwned.com ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు.

ఇదీ చూడండి: కఠినమైన పాస్​వర్డ్​లు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Dec 26, 2019, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details