దిగ్గజ మొబైల్ సంస్థలకు పోటీగా అత్యాధునిక ఫీచర్లతో 'ఎంఐ' మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి... మొబైల్ రంగంలోనే విప్లవం సృష్టించింది షియోమీ. యాపిల్, వన్‌ప్లస్ వంటి ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లతో... ఎంఐ మొబైల్స్‌ను తయారు చేసి, అతి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించింది. అలాంటి సంస్థ తొలిసారి ల్యాప్‌టాప్‌లతో భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఆ ఉత్పత్తులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎంఐ నోట్‌బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ను.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా ప్రదర్శించనున్నారు సంస్థ ప్రతినిధులు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే తేదీని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ సహా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.