తెలంగాణ

telangana

ETV Bharat / business

టిక్​టాక్​ సీఈఓ పదవికి కెవిన్​ రాజీనామా.. కారణమిదే

టిక్​టాక్ విక్రయానికి అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ సీఈఓ కెవిన్​ మేయర్​ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఉద్యోగులకు పంపిన లేఖలో కెవిన్ స్వయంగా వెల్లడించారు.

Kevin Mayer resigned as Tik tok ceo
టిక్​ టాక్​ సీఈఓ రాజీనామా

By

Published : Aug 27, 2020, 11:50 AM IST

ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్​టాక్​ సీఈఓ కెవిన్​ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్​టాక్​ వ్యాపారాలను విక్రయించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో కెవిన్ పేర్కొన్నారు.

భద్రత పరమైన కారణాలతో టిక్​టాక్​ను అమెరికాలో నిషేధించే దిశగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చర్యలు ముమ్మరం చేశారు. టిక్​టాక్ వ్యాపారాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్​డ్యాన్స్​కు 90 రోజుల గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కెవిన్ టిక్​టాక్​ను వీడటం గమనార్హం.

మే నెలలోనే టిక్​టాక్​ సీఈఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి:100బిలియన్ డాలర్లు దాటిన మస్క్ సంపద

ABOUT THE AUTHOR

...view details