తెలంగాణ

telangana

ETV Bharat / business

కీబోర్డులో ఏం టైప్​ చేసినా.. టిక్‌టాక్‌ కాపీ​ చేస్తుంది! - టిక్​టాక్​ యాప్​ మోసాలు

చైనా సామాజిక మాధ్యమం టిక్​టాక్​ వినియోగిస్తున్నారా! అయితే జాగ్రత్త. మీ ఫోన్​లో ఉన్న టిక్​టాక్​.. మీ సమాచారం మొత్తాన్ని రహస్యంగా కాపీ చేస్తుందని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని జెర్మె బర్గ్‌ అనే ఎమోజీ హిస్టోరియన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

TikTok caught spying on iPhone users in India and around the world
కీబోర్డులో ఏం టైప్​ చేసినా.. టిక్‌టాక్‌ కాపీ​ చేస్తుంది!

By

Published : Jun 28, 2020, 10:34 PM IST

చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్‌ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ఒక్కటే చాలా హైప్రొఫైల్‌ యాప్‌ల వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయింది. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదని ఐఫోన్‌ 14 ఐవోఎస్‌ డెమో వెర్షన్‌లో తేలింది.

క్లిప్‌బోర్డు ఫంక్షన్​తో సమస్య..

ఐవోఎస్ క్లిప్‌ బోర్డ్‌ ఫంక్షన్‌లో వినియోగదారుడు ఒక యాప్‌ నుంచి టెక్స్ట్‌ లేదా ఇమేజ్‌ను కాపీ చేసి మరో యాప్‌లో పేస్టు చేస్తాడు. దీంతోపాటు ఒక యాపిల్‌ పరికరం నుంచి మరో యాపిల్‌ పరికరంలోకి కూడా కాపీ చేయవచ్చు. అంటే ఐఫోన్‌ నుంచి మాక్‌ లేదా పీసీలోకి. కానీ, ఏదైనా యాప్‌ మన ఫోన్‌లోని టెక్స్ట్‌ , ఇమేజ్, డేటాను కాపీ చేస్తుంటే యాపిల్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ దానిని గుర్తించి వెల్లడిస్తుంది. ఈ విషయాన్ని జెర్మె బర్గ్‌ అనే ఎమోజీ హిస్టోరియన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:వర్క్​ ఫ్రం హోంతో.. మెరుగైన బ్యాంకర్ల ప్రొడక్టివిటీ

ABOUT THE AUTHOR

...view details