తెలంగాణ

telangana

ETV Bharat / business

టాప్-​10 ఉత్తమ సీఈఓల్లో ముగ్గురు మనోళ్లే - ప్రపంచంలో 10 ఉత్తమ సీఈఓలు

ప్రపంచవ్యాప్తంగా 10 మంది ఉత్తమ క్యార్యనిర్వాహక అధికారుల్లో ముగ్గురు భారత సంతతి సీఈఓలు చోటు దక్కించుకున్నారు. వీరిలో శంతను నారాయణ్​(ఆడోబ్​ సీఈఓ), అజయ్​ బంగా (మాస్టర్​ కార్డ్ సీఈఓ),  సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ) వరుసగా 6,7,9 స్థానాల్లో ఉన్నారు. "హార్వర్డ్​ వ్యాపార సమీక్ష 2019"లో వీరి పేర్లను ప్రకటించారు.

టాప్-​10 ఉత్తమ సీఈఓల్లో ముగ్గురు భారతీయులే

By

Published : Oct 29, 2019, 5:22 PM IST

ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఉత్తమ కార్యనిర్వాహక అధికారుల్లో.. ముగ్గురు భారత సంతతి సీఈఓలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఉత్తమ పనితీరు కనబరిచిన సీఈఓల జాబితాను "హార్వర్డ్ వ్యాపార సమీక్ష 2019"లో ప్రకటించారు.

ఆర్థికపరమైన పనితీరు, పని వాతావరణం, సామాజిక, పాలనాపరమైన రేటింగ్​ల ఆధారంగా హార్వర్డ్​ వ్యాపార సమీక్ష జాబితాను రూపొందిస్తారు.

ముగ్గురు భారతీయులు...

ఉత్తమ సీఈఓల జాబితాలోని టాప్​10లో.. భారత సంతతికి చెందిన కార్యనిర్వాహక అధికారులు.. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్​ 6వ స్థానాన్ని, మాస్టర్​ కార్డ్ సీఈఓ అజయ్​ బంగా 7వ స్థానాన్ని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ జాబితాలో అమెరికాకు చెందిన సాంకేతిక సంస్థ ఎన్​వీఐడీఐఏ- సీఈఓ జన్​సెన్​ హాంగ్ ఆగ్ర స్థానంలో నిలిచారు. డీబీఎస్​ బ్యాంకు సీఈఓ పీయూష్​ గుప్త 89వ స్థానంతో ఉత్తమ 100 మంది సీఈఓల జాబితాలో ఉన్న భారతీయుడిగా గుర్తింపు సాధించారు.

టాప్​ 100లో ప్రముఖ సీఈఓలు..

ప్రముఖ షూ కంపెనీ నైకీ సీఈఓ మార్క్ పార్కర్ 20వ స్థానంలో ఉండగా.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ 62వ స్థానంలో ఉన్నారు. అయితే 2014 నుంచి ఉత్తమ సీఈఓల్లో ఆగ్ర స్థానంలో ఉంటున్న జెఫ్​ బెజోస్​కు (అమెజాన్ సీఈఓ).. ఈ సారి జాబితాలో కనీసం చోటుదక్కలేదు.

ఇదీ చూడండి: లొకేషన్​ విషయంలో గూగుల్​ మోసం చేస్తోందా?

ABOUT THE AUTHOR

...view details