తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులకు వరుస సెలవులు.. ఇప్పుడే చూసుకోండి..!

బ్యాంకుల్లో ఏవైనా పనులుంటే ఈ నెలలో వీలైనంత ముందుగానే పూర్తిచేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా 'బ్యాంకుకు నేడు సెలవు' అనే బోర్డులే దర్శనమివ్వనున్నాయి. ఇందుకు ఏదైనా సమ్మె కారణమనుకుంటే పొరపాటే. దసరా, దీపావళి పండుగలు సహా.. ఇటీవల ముగిసిన గాంధీ జయంతి వంటి ప్రభుత్వ సెలవులు బ్యాంకుల వరుస హాలిడేలకు కారణం.

మీ ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడే ప్లాన్​ చేసుకోండి

By

Published : Oct 5, 2019, 4:32 PM IST

ద‌స‌రా, దీపావ‌ళి పండుగలు, శని ఆదివారాల కారణంగా ఈ నెలలో బ్యాంకులు ఎక్కువ సెలవుల్లో ఉండనున్నాయి. సాధార‌ణంగా రెండు, నాలుగో శ‌నివారాల్లో బ్యాంకుల‌కు సెల‌వు. 4 ఆదివారాలు, అక్టోబ‌ర్ 2న ముగిసిన గాంధీ జ‌యంతితో క‌లిపిమొత్తంఅక్టోబ‌ర్‌లో క‌నీసం 8 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు.

ఇక ప‌శ్చిమ్​ బంగాలో దుర్గా పూజ సంద‌ర్భంగా వ‌రుస‌గా అక్టోబ‌ర్ 5 నుంచి 8 వ‌ర‌కు బ్యాంకుల‌కు సెల‌వు అని వెల్ల‌డించారు. త‌మిళ‌నాడులో అక్టోబ‌ర్ 7న ఆయుధ పూజ కార‌ణంగా బ్యాంకుల‌కు సెల‌వు. కొన్ని బ్యాంకులు అక్టోబ‌ర్ 28, 29న కూడా దీపావ‌ళి, భాయ్‌దూజ్ కార‌ణంగా సెల‌వుల‌ను ప్ర‌క‌టించాయి.

అక్టోబ‌ర్ 6 ఆదివారం, అక్టోబ‌ర్ 7న న‌వ‌మి, అక్టోబ‌ర్ 8న ద‌స‌రా కార‌ణంగా మూడు రోజులు సెలవుదినాలని బ్యాంకుల సంఘం వెల్ల‌డించింది. అందుకే బ్యాంకుల్లో కార్య‌క‌లాపాలు ఉన్న‌వారు ప‌నిదినాల్లో తమ సేవ‌ల‌ను పొందాల‌ని, త‌ర్వాత‌ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా త్వ‌ర‌గా వారి ప‌నుల‌ను పూర్తిచేసుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు.

అక్టోబ‌ర్‌లో ఉన్న మొత్తం బ్యాంకు సెల‌వులు..

  • అక్టోబ‌ర్ 2 - గాంధీ జ‌యంతి (ముగిసింది)
  • అక్టోబ‌ర్ 6 - ఆదివారం
  • అక్టోబ‌ర్ 8 - ద‌స‌రా
  • అక్టోబ‌ర్ 12 - రెండో శ‌నివారం
  • అక్టోబ‌ర్ 13 - ఆదివారం
  • అక్టోబ‌ర్ 20 - ఆదివారం
  • అక్టోబ‌ర్ 26 - నాలుగో శ‌నివారం
  • అక్టోబ‌ర్ 27- దీపావ‌ళి ఆదివారం

ఇదీ చూడండి: 'లిబ్రా' నుంచి వైదొలిగిన పేపాల్​.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details