తెలంగాణ

telangana

ETV Bharat / business

మెక్​డీ- కేఎఫ్​సీ ఆదాయం ఇంతా..! - బర్గర్​ కింగ్ ఆదాయం ఎంత

ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్​ ఫుడ్​ మార్కెట్​కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో ప్రపంచ స్థాయి సంస్థలు భారీ సంఖ్యలో ఫ్రాంఛైజీలను నిర్వహిస్తున్నాయి. ఈ మార్కెట్లో ఉన్న ప్రధాన కంపెనీలు ఏవి? వాటి ఆదాయాలు ఎంత? అనే వివరాలతో ఓ ప్రత్యేక కథనం మీ కోసం.

World Biggest Fast food restaurants
ప్రపంచ దిగ్గజ ఫాస్ట్​ఫుడ్​ ఫ్రాంఛైజీలు

By

Published : Jun 25, 2021, 7:48 PM IST

ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన పిజ్జాలు, బర్గర్​లకు ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో విపరీతమైన ఆదరణ దక్కుతోంది. దీనితో 'ఫాస్ట్​ ఫుడ్' మార్కెట్ కూడా అంతే వేగంగా వృద్ధి సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ప్రధాన నగరాల్లో ఫ్రాంఛైజీలను నడిపిస్తున్నాయి ఆయా ఫాస్ట్ ఫుడ్​ రెస్టారెంట్ నిర్వహణ సంస్థలు.

ఇలా ప్రపంచంలోనే అత్యధికంగా ఔట్​లెట్లు ఉన్న సంస్థలు ఏవి? వాటి వార్షిక ఆదాయం ఎంత?

స్టార్​ బక్స్​(Starbucks)

1971లో ఈ సంస్థ ప్రారంభమైంది.

ప్రపంచవ్యాప్తంగా స్టార్​ బక్స్​కు​ 32,660 ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

గత ఏడాది నాటికి 83 దేశాల్లో ఈ సంస్థ కార్యకలపాలు సాగిస్తోంది. భారత్​లో ఈ సంస్థ టాటా గ్రూప్​తో కలిసి పని చేస్తుండటం గమనార్హం.

స్టార్​ బక్స్​

2020లో ఈ సంస్థ దాదాపు 26.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది. ప్రపంచవ్యాప్తంగా స్టార్ బక్స్ కాఫీహౌస్​లకు భారీ డిమాండ్ ఉంది.

మెక్​ డొనాల్డ్స్​(McDonalds)

మెక్​డీ 1940 మార్చి 15న ప్రారంభమైంది.

ప్రపంచవ్యాప్తంగా దీనికి 38,695 ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

మెక్​డొనాల్డ్స్​

2020లో ఈ సంస్థ ఆదాయం 20.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. హామ్​బర్గర్​ మార్కెట్​లో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

కేఎఫ్​సీ(KFC)

కేఎఫ్​సీ పూర్తి పేరు కెంటకీ ఫ్రైడ్ చికెన్​. 1930లో ఇది సాండర్స్ కోర్ట్​&కేఫ్​ పేరుతో రెస్టారెంట్​ నిర్వహించింది. 1952లో తొలి ఫ్రాంఛైజీ ప్రారంభించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24,104 ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది కేఎఫ్​సీ.

కేఎఫ్​సీ

గత ఏడాది ఈ సంస్థ ఆదాయం 26.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

సబ్​వే..(Subway)

1965 నుంచి సబ్​వే ఫాస్ట్​ఫుడ్​ ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా దీనికి 42,600 ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

సబ్​వే

సబ్​వే ఆదాయం 2020లో 10.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

డోమినోస్​..(DOmino's)

డోమినోస్ 1960లో ప్రారంభమైంది.

ప్రపంచవ్యాప్తంగా డోమినోస్​కు 17,020 ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

డోమినోస్​

2020లో డోమినోస్​ 3.62 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని గడించింది.పిజ్జా అనగానే.. చాలా మందికి గుర్తెచ్చే బ్రాండ్​ ఇదే అనడంలో సందేహం లేదు.

పిజ్జా హట్..(Pizza Hut)

పిజ్జా హట్​ 1958 నుంచి ఫాస్ట్​ఫుడ్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 18,703 ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

పిజ్జా హట్​

2020లో దీని ఆదాయం 1.5 బిలియన్ డాలర్లు నమోదైంది. భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా పిజ్జా బిజినెస్​లో డోమినోస్​కు గట్టి పోటీ ఇస్తోంది ఈ సంస్థ.

డంకిన్​ డోనట్స్​..(Donkin Donuts)

ఈ సంస్థ 1950లో ప్రారంభమైంది. అమెరికా సహా పలు ఇతర దేశాల్లో డంకిన్​ పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇతర దేశాల్లో డంకిన్​ డోనట్స్​ పేరుతోనే ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 12,500లకు పైగా ఫ్రాంఛైజీలు ఉన్నాయి.

డన్​కిన్​ డోనట్స్​

గత ఏడాది 1.37 బిలియన్ డాలర్ల ఆదాయన్ని గడించింది ఈ సంస్థ.

బర్గర్​ కింగ్..(Burger)

1954లో బర్గర్​ కింగ్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 18,838 ఫ్రాంఛైజీలను నిర్వహిస్తోంది. 2020లో 1.3 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

బర్గర్​ కింగ్

ఈ సంస్థలన్నీ అమెరికా కేంద్రంగానే పని చేస్తుండటం గమనార్హం.

ఇదీ చదవండి:గుడ్ న్యూస్​: హీరో బైక్​ల ధరలు భారీగా తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details