తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద వచ్చే అయిదేళ్లలో రూ.10.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు తయారు చేయాలనే ప్రణాళికతో, రూ.11,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చిన 16 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఐఫోన్ తయారీదారు యాపిల్ కాంట్రాక్టు ఉత్పత్తిదారులు ఫాక్స్‌కాన్ హాన్ హాయ్, విస్ట్రాన్, పెగాట్రాన్, శామ్‌సంగ్, రైజింగ్ స్టార్ వంటి సంస్థల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఇక లావా, భగ్వాటీ (మైక్రోమాక్స్), ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ (డిక్సన్ టెక్నాలజీస్), యూటీఎల్ నియోలింక్స్, ఆప్టిమస్ వంటి దేశీయ కంపెనీల ప్రతిపాదనలకు సైతం ఆమోదం లభించింది.