అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్)లు డిజిటల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లో రూ.7558 కోట్ల(1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తెలిపింది.
రిలయన్స్ 'ఫైబర్'లోకి రూ.7558 కోట్ల పెట్టుబడులు - Reliance Fiber
రిలయన్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(ఏడీఐఏ), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్)లు డిజిటల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లో రూ.7558 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తెలిపింది.
రిలయన్స్ 'ఫైబర్'లోకి రూ.7558 కోట్ల పెట్టుబడులు
ఆర్‌ఐఎల్‌కు చెందిన ఫైబర్ ఆప్టిక్స్ ఆస్తులను 'ద డిజిటల్ ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్' నిర్వహిస్తుంది. అంతక్రితం ఇది జియోలో భాగంగా ఉండేది. ఏడీఐఏ, పీఐఎఫ్‌లు ఇందులో చెరో రూ.3,779 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆర్‌ఐఎల్ వివరించింది. అంతక్రితం రిలయన్స్ రిటైల్‌లో ఏడీఐఏ రూ.5,512.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ తర్వాత పెరిగిన వాహన విక్రయాలు- కారణమిదే