తెలంగాణ

telangana

ETV Bharat / business

బిట్​కాయిన్​లో టెస్లా భారీ పెట్టుబడులు

ప్రముఖ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ టెస్లా.. బిట్​కాయిన్​లో 1.5 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ​దీంతో బిట్​కాయిన్ విలువ ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

ూtesla in bitcoin
బిట్​ కాయిన్​లో 'టెస్లా' భారీ పెట్టుబడులు

By

Published : Feb 8, 2021, 10:20 PM IST

Updated : Feb 8, 2021, 11:03 PM IST

ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్​ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ 'టెస్లా'.. బిట్​కాయిన్​లో భారీగా పెట్టబడులు పెట్టింది. బిట్​కాయిన్లలో దాదాపు 1.5 బిలియన్​ డాలర్లు(దాదాపు 10,930 కోట్లు) కొనుగోలు చేసింది. త్వరలోనే తమ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్​ చెల్లింపులను బిట్​ కాయిన్ల రూపంలోనూ స్వీకరించనుందీ సంస్థ.

డిజిటల్​ కరెన్సీ సహా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ పెట్టుబడులు పెరుగుతాయని.. అమెరికా సెక్యూరిటీస్​ అండ్​ ఎక్ఛేంజ్​ కమిషన్​కు టెస్లా సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో బిట్​కాయిన్​ విలువ 15 శాతం పెరిగి, 43,863 డాలర్లకు చేరింది. టెస్లా షేర్ల విలువ కూడా పెరిగింది.

గత నెలలో నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో టెస్లా వద్ద నగదు, నగదు సమానమైన 19.4 బిలియన్ డాలర్లు ఉన్నాయని ప్రకటించింది.

ఇదీ చదవండి:ఈసారి 'డాజ్​ కాయిన్'​కు హిట్​​ ఇచ్చిన మస్క్​!

Last Updated : Feb 8, 2021, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details