తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో కొత్త ప్లాన్ల​తో- ఎయిర్​టెల్, వీ విలవిల! - వొడాఫోన్ ఐడియా షేరు విలువ

చౌక ధరలో పోస్ట్​పెయిడ్ ప్లాన్స్​ను విడుదల చేస్తూ.. రిలయన్స్ జియో చేసిన ప్రకటన ప్రత్యర్థి టెలికాం సంస్థలకు భారీ నష్టాలను మిగిల్చింది. జియో మంగళవారం చేసిన ఈ ప్రకటనతో బుధవారం స్టాక్ మార్కెట్​లో ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి.

jio postpaid plans impact on Airtel
జియో కొత్త ప్లాన్స్​తో ఎయిర్​టెల్ షేర్లు విలవిల

By

Published : Sep 23, 2020, 11:29 PM IST

మార్కెట్లోకి ప్రవేశిస్తూనే.. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి సరికొత్త ఆఫర్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తూ.. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. తాజాగా ప్రకటించిన పోస్ట్​పెయిడ్​ ప్లాన్లతో మరో అడుగు ముందుకేసింది.

అయితే ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా భారీగానే పడింది. తక్కువ ధరలో పోస్ట్​పెయిడ్​ ప్లాన్లను అందుబాటులోకి తెస్తూ రిలయన్స్ మంగళవారం చేసిన ప్రకటనతో.. బుధవారం ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా(వీ) షేర్లు భారీగా కుప్పకూలాయి.

వొడాఫోన్​ ఐడియా షేర్లు బీఎస్​ఈలో భారీగా (10.05శాతం) నష్టపోయాయి. దీంతో ఒక షేరు విలువ ప్రస్తుతం రూ.9.22గా ఉంది.

మరోవైపు ఎయిర్​టెల్ షేర్లు కూడా బీఎస్​ఈలో 7.89శాతం పడిపోయాయి. ఒక్క ఎయిర్​టెల్ షేరు విలువ రూ.423.95 వద్దకు చేరింది. 30 షేర్ల ఇండెక్స్​లో బుధవారం అత్యధికంగా నష్టపోయిన కంపెనీ కూడా ఇదే కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details