ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభాల్లో 0.2 శాతం వృద్ధిని కనబర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.8,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించినట్లు సంస్థ ప్రకటించింది.
2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ రూ.8,105 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది.