తెలంగాణ

telangana

By

Published : Oct 10, 2019, 6:10 PM IST

ETV Bharat / business

టీసీఎస్​కు​ లాభాల పంట.. డివిడెండ్ ప్రకటన

టెక్​ దిగ్గజం టీసీఎస్​ రెండో త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబరిచింది. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.38,977 కోట్ల ఆదాయం, రూ.8,042 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ సందర్భంగా ఒక్కో ఈక్విటీ షేర్​కు రూ.40 ప్రత్యేక డివిడెండ్​ ప్రకటించింది.

టీసీఎస్​కు​ లాభాల పంట.. డివిడెండ్ ప్రకటన

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ సంస్థ సెప్టెంబర్​తో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఈ మూడు నెలల్లో 1.8 శాతం వృద్ధితో రూ.8,042 కోట్ల నికర లాభం ఆర్జించింది. సంస్థ ఆదాయం 5.8 శాతం పెరిగి రూ.38,977 కోట్లకు చేరుకుంది.

గత ఏడాది ఇదే సమయంలో 36,854 కోట్ల ఆదాయంపై రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది టీసీఎస్.

డివిడెండ్​ ప్రకటన...

టెక్​ కంపెనీలను వెనక్కి నెడుతూ భారీ లాభాలను ఆర్జించిన సంస్థ వాటాదారులకు రెండోసారి మధ్యంతర డివిడెండ్ రూ.5 ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్​పై ప్రత్యేక డివిడెండ్​ రూ.40 ఇచ్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.

"ఆర్థిక సేవలు, రిటైల్​ రంగాల్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధితో రెండో త్రైమాసికాన్ని ముగించాం. క్యూ2 ఫలితాలతో మా సేవలకు మధ్యస్థ, దీర్ఘకాలిక డిమాండ్​ చాలా బలంగా కొనసాగుతుందన్న నమ్మకం ఉంది. "

- రాజేశ్​ గోపీనాథ్​, టీసీఎస్​ సీఈఓ, ఎండీ.

ఇదీ చూడండి:మీరు జియో కస్టమరా? అయితే ఇది మీకోసమే...

ABOUT THE AUTHOR

...view details