దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) సరికొత్త గరిష్ఠానికి చేరింది. సంస్థ షేర్లు సోమవారం జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ఎం-క్యాప్ తొలిసారి రూ.11 లక్షల కోట్ల మార్క్ దాటింది.
బీఎస్ఈలో టీసీఎస్ షేరు ప్రస్తుతం 1.30 శాతానికిపైగా వృద్ధితో రూ.2,947 వద్ద ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేరు 1.35 శాతం లాభంతో రూ.2,948 వద్ద కొనసాగుతోంది.