దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథ్ 2020-21లో రూ.20.36 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. 2019-20లో ఆయన పారితోషికం రూ.13.3 కోట్లుగా ఉండటం గమనార్హం.
టీసీఎస్ నివేదిక ప్రకారం.. 2020-21లో గోపీనాథ్ రూ.1.27 కోట్లు వేతనం రూపంలో, రూ.2.09 కోట్లు అలవెన్సుల రూపంలో, రూ.17 కోట్లను కమీషన్‌గా అందుకున్నట్లు తెలిసింది.
ఇదే సమయంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ).. ఎన్ గణపతి సుబ్రమణియం రూ.16 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలిపింది టీసీఎస్. ఆయన వేతనం రూ.1.21 కోట్లుగా పేర్కొంది. అలవెన్సుల రూపంలో ఆయన రూ.1.88 కోట్లు, కమీషన్‌గా రూ.13 కోట్లు తీసుకున్నట్లు వివరించింది.