తెలంగాణ

telangana

ETV Bharat / business

16 వేల కోట్ల బై బ్యాక్ ప్లాన్​కు టీసీఎస్​ బోర్డు ఆమోదం

TCS Board
టీసీఎస్

By

Published : Oct 7, 2020, 7:02 PM IST

Updated : Oct 7, 2020, 7:36 PM IST

18:57 October 07

బై బ్యాక్ ప్లాన్​కు టీసీఎస్​ బోర్డు ఆమోదం

దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) ఈక్విటీ షేర్ల బైబ్యాక్​కు సిద్ధమైంది. ​ 16 వేల కోట్ల రూపాయల బైబ్యాక్ ప్రణాళిక​కు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో బైబ్యాక్ ఈక్వీటీ షేరు విలువ రూ.3 వేలుగా అంగీకారం తెలిపింది.

మొత్తం 5.33 కోట్ల షేర్ల బైబ్యాక్​ ప్రతిపాదనను టీసీఎస్​ ఆమోదించింది. బీఎస్​ఈ సెన్సెక్స్​లో బుధవారం టీసీఎస్​ షేర్ల ముగింపు ధర కంటే ఇది 9 శాతం ఎక్కువ. బీఎస్​ఈలో ప్రస్తుతం టీసీఎస్​ షేర్ విలువ రూ.2,737.4 గా ఉంది.  

రెండో త్రైమాసికంలో టీసీఎస్​ ఏకీకృత నికర లాభం 4.9 శాతం పెరిగి రూ.8,433 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం 3 శాతం.. అంటే రూ.38,977 కోట్ల నుంచి రూ.40,135 కోట్లకు పెరిగింది.  

ఇదీ చూడండి:రిలయన్స్​లోకి మరో రూ.5,512కోట్ల పెట్టుబడులు

Last Updated : Oct 7, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details