దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో ఘనత సాధించింది. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థల్లో మూడో ర్యాంకును దక్కించుకుంది.
'బ్రాండ్ విలువ 11 శాతం వృద్ధితో 15 బిలియన్లు డాలర్లకు చేరడం వల్ల ఐబీఎంతో పోలిస్తే స్వల్ప తేడాతో మూడో స్థానంలో నిలిచింది టీసీఎస్.' అని 'గ్లోబల్ 500-2021' పేరుతో బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
ఈ జాబితాలో 26 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో యాక్సెంచర్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐబీఎం 16.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానాన్ని కొనసాగించింది.
'బ్రాండ్ వ్యాల్యూ' అనేది ప్రస్తుత ఆదాయాల విలువను సూచిస్తుందని పేర్కొంది బ్రాండ్ ఫినాన్స్.