కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్ తన ఔదార్యాన్ని చాటుకుంది. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
టాటా స్టీల్ ఔదార్యంపై ప్రశంసలు