యూకే ప్లాంటులో 50 శాతం వాటాను బ్రిటన్ ప్రభుత్వానికి కేటాయించాలని టాటా స్టీల్ భావిస్తోంది. ఇందుకు ప్రతిగా 900 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.8,600 కోట్ల) అందించాలని కోరుతోంది. కంపెనీలో ఈక్విటీ వాటా తీసుకోవాల్సిందిగా టాటా స్టీల్ ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వం నిధులు చొప్పిస్తే.. బ్రిటన్ పన్ను చెల్లింపుదార్లకు 50 శాతం వరకు వాటా ఇవ్వడానికి కంపెనీ సిద్ధమైనట్లు స్కై న్యూస్ చెబుతోంది.
టాటా స్టీల్ యూకే ప్లాట్‌లో బ్రిటన్‌కు సగం వాటా! - టాాట స్టీల్ యూకే ప్లాంట్‌లో బ్రిటన్‌కు వాటా
వేల్స్‌లోని పోర్ట్ టాల్‌బాట్ స్టీల్ వర్క్స్ సహా యూకేలోని కార్యకలాపాలను రక్షించుకునేందుకు అందులో సగం వాటాను బ్రిటన్ ప్రభుత్వానికి కేటాయించేందుకు టాటా స్టీల్ సిద్ధమైంది. ఇందుకు బదులుగా బ్రిటన్ నుంచి రూ.8,600 కోట్ల నిధులు కోరుతున్నట్లు సమాచారం.
టాటా స్టీల్ యూకే ప్లాంట్‌లో వాటా విక్రయం
వేల్స్‌లోని పోర్ట్ టాల్‌బాట్ స్టీల్ వర్క్స్ సహా బ్రిటన్ కార్యకలాపాలను రక్షించుకునేందుకు టాటా స్టీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది స్కై న్యూస్. కరోనా సంక్షోభం నేపథ్యంలో నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీలకు తోడ్పాటు ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ బిర్చ్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీని నుంచే టాటా స్టీల్ నిధులు కోరుతోంది.