తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా స్టీల్​లో 3,000 ఉద్యోగాలకు కోత..! - బిజినెస్​ వార్తలు తెలుగు

భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది టాటా స్టీల్​. ఐరోపాలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంస్థ.. అక్కడి ఉద్యోగుల్లో 3 వేల వరకు తగ్గించుకోవాలని భావిస్తోంది.

టాటా స్టీల్​

By

Published : Nov 19, 2019, 10:00 PM IST

ఐరోపా కార్యకలాపాల నుంచి దాదాపు 3 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమైంది టాటా స్టీల్​. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం ధ్రువీకరించింది. ఐరోపాలో స్తబ్దుగా, అంతర్జాతీయ మార్కెట్లో అవసరానికి మించి ఉన్న ఉక్కు డిమాండ్​ సమస్యలను ఎదుర్కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా స్టీల్​ వెల్లడించింది.

ముఖ్యంగా కార్యాలయాల్లో పని చేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో.. మూడింట రెండొంతుల మందిని తొలగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నెదర్లాండ్స్​కు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం పారిశ్రామిక రంగాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఎక్కువగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి.

టాటా స్టీల్​ విషయానికొస్తే.. సంక్షోభంలో చిక్కుకోకుండా జర్మనీకి చెందిన థైసెన్​క్రప్​తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయత్నించింది. అయితే ఆ ఒప్పందం కుదరకపోవడం కారణంగా తీవ్ర ఒడుదొడుకుల్లోకి జారుకుంది. ఉద్యోగులను తగ్గించుకున్నప్పటికీ.. సంస్థ కార్యకలాపాలు నిలిపే ప్రసక్తే లేదని టాటా స్టీల్ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: బీఎస్ఎన్​ఎల్​ వీఆర్​ఎస్ దరఖాస్తులు​ @77,000

ABOUT THE AUTHOR

...view details