Air India new chairman: ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్‌కు ఆయన ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై విమానయాన సంస్థకూ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా బోర్డు ఆయన నియామకానికి సోమవారం ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకున్న నేపథ్యంలో ఈ నియామకం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా ఛైర్మన్‌తో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సీఎండీగా వ్యవహరించిన అలైస్ గీ వర్గీస్ వైద్యన్‌ను బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ - టర్కిష్ ఎయిర్‌లైన్స్
Air India new chairman: ఎయిర్ ఇండియా కొత్త ఛైర్మన్‌ను ప్రకటించింది. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌నే ఎయిర్ ఇండియాకు ఛైర్మన్‌గా నియమించింది. ఇటీవల ప్రభుత్వం నుంటి టాటా గ్రూప్ ఈ సంస్థను దక్కించుకుంది.
ఎయిర్ ఇండియా ఛైర్మన్ చంద్రశేఖరన్
ఇప్పటికే.. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టీసీఎస్ కంపెనీలకు చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా వ్యవవహరిస్తున్నారు.మరోవైపు సంస్థకు కొత్త సీఈఓను సైతం ఎయిర్ ఇండియా త్వరలో నియమించనుంది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ అయిసీని సీఈఓగా నియమించేందుకు గతనెల బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ ఆయన నిరాకరించారు. దీంతో సంస్థ కొత్త సీఈఓను త్వరలోనే ప్రకటిస్తామని టాటాసన్స్ వెల్లడించింది..
ఇదీ చదవండి:ఎల్‌ఐసీ ఐపీఓకి మే 12 వరకే గడువు.. ఆ తర్వాత..