తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా సన్స్​ చేతికి తేజస్​​- డీల్​ విలువ ఎంతంటే? - టాటా సన్స్​ తేజస్​ నెట్​వర్క్​ డీల్ విలువ

దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్​ తేజస్​ నెట్​వర్క్స్​లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనుంది. టాటా సన్స్ అనుబంధ సంస్థ పనాటోన్ ఫిన్వెస్ట్​ ద్వారా ఈ డీల్​ను పూర్తి చేయనుంది కంపెనీ. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.1,890 కోట్లు.

Tata Sons Buy  controlling stake in Tejas Networks
టాటాల చేతికి తేజస్ నెట్స్​వర్క్స్​

By

Published : Jul 29, 2021, 12:16 PM IST

టెలికాం, నెట్​వర్క్ టెక్​​ సంస్థ తేజస్​ నెట్​వర్క్స్​ను టాటా సన్స్​ అనుబంధ కంపెనీ ​ స్వాధీనం చేసుకోనుంది. ఈ డీల్​ విలువ దాదాపు రూ.1,890 కోట్లు. టాటా సన్స్​కు చెందిన.. పనాటోన్ ఫిన్వెస్ట్​కు.. తమ కంపెనీలో నియంత్రణ వాటాను అప్పగించే ప్రక్రియ దశలవారీగా జరగనున్నట్లు తేజస్​ నెట్​వర్క్స్​​ గురువారం ప్రకటించింది.

షేర్ల కేటాయింపు ఇలా..

  • ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశ ప్రాధాన్యం షేర్ల కేటాయింపులో 1.94 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.258 చొప్పున(ఒక్కో షేరుకు).. మొత్తం రూ.500 కోట్లతో దక్కించుకోనుంది పనాటోన్ ఫిన్వెస్ట్​.
  • రెండో దశలో 3.68 కోట్ల షేర్లను రూ.258 చొప్పున (మొత్తం రూ.952 కోట్లకు) పనాటోన్ ఫిన్వెస్ట్​కు కేటాయించనుంది తేజస్​ నెట్​వర్క్స్​.
  • మూడో దశలో.. 1.55 కోట్ల షేర్లను.. రూ.258తో (రూ.400 కోట్లతో) కొనుగోలు చేయనుంది టాటా సన్స్​ అనుబంధ సంస్థ.
  • వీటన్నిటితో పాటు.. వ్యక్తిగత నిర్వహణలో ఉన్న 13 లక్షల ఈక్విటీ షేర్లను కూడా.. రూ.258 చొప్పున కొనుగోలు చేయనుంది పనాటోన్ ఫిన్వెస్ట్​. ఈ లావాదేవీ విలువ రూ.34 కోట్లు.

ఇదీ చదవండి:ఆదివారం నుంచి టాటా కార్లు మరింత ప్రియం

ABOUT THE AUTHOR

...view details