దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2019-20 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.3,679.66 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.1,862.57 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా మోటార్స్ పూర్తి ఆదాయం రూ.61,466.99 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 66,701.05 కోట్లుగా ఉంది. టాటా మోటార్స్ వాహనాల అమ్మకాలు 22.7 శాతం క్షీణించాయి. 2019-20 క్యూ1లో 1,36,705 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.
టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటీష్ వాహన సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) 2019-20 క్యూ1లో పన్నులకు ముందు 395 మిలియన్ పౌండ్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 264 మిలియన్ పౌండ్ల నష్టాన్ని నమోదు చేసింది.