టాటా సన్స్- సైరస్ మిస్త్రీ వివాదంలో జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీసుకున్న మరో నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇదీ జరిగింది..
టాటా సన్స్- సైరస్ మిస్త్రీ వివాదంలో జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీసుకున్న మరో నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఇదీ జరిగింది..
సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్గా పునర్నియమిస్తూ ఎన్సీఎల్ఏటీ గతేడాది తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పులో మార్పులు చేయాలని ఎన్సీఎల్ఏటీకి విజ్ఞప్తి చేసింది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ). కానీ అందులో మార్పులు చేసేందుకు ఎన్సీఎల్ఏటీ నిరాకరించి ఆర్ఓసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కారణంగా ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఆర్ఓసి.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపి ఎన్సీఎల్ఏటీ నిర్ణయంపై తాజాగా స్టే విధించింది.
సైరస్ మిస్త్రీని కార్యనిర్వాహక ఛైర్మన్గా నియమిస్తూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత న్యాయస్థానం ఈనెల 10న స్టే విధించింది.