తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటాల చేతికి ఎయిర్ఇండియా! - ఎయిర్​ ఇండియా సంక్షోభం

Air India, Tata group
ఎయిర్​ ఇండియా, టాటా గ్రూప్​

By

Published : Oct 1, 2021, 11:41 AM IST

Updated : Oct 1, 2021, 5:13 PM IST

11:38 October 01

టాటాల చేతికి ఎయిర్ఇండియా!

భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్‌ ఇండియా కొనుగోలు బిడ్‌ను దేశీయ దిగ్గజ సంస్ధ టాటా సన్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. టాటా సన్స్‌ బిడ్‌కు కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదం తెలిపినట్లు న్యూస్‌ ఏజెన్సీ బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక వెల్లడించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

భారీ నష్టాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విక్రయానికి కేంద్రం బిడ్లను ఆహ్వానించగా....టాటా సన్స్‌, స్పైస్‌ జెట్‌ ముందుకు వచ్చాయి. దీనిలో టాటా సన్స్‌ వైపే కేంద్ర మంత్రుల కమిటీ మొగ్గు చూపినట్లు తెలిసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం ఎయిర్‌ ఇండియాకు రూ.38,366 కోట్ల అప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. 

ఎయిర్‌ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్‌లైన్స్‌. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను పారిశ్రామిక దిగ్గజం జె.ఆర్‌.డి టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసి ఎయిర్ ఇండియాగా పేరు మార్చింది.

Last Updated : Oct 1, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details