తెలంగాణ

telangana

ETV Bharat / business

68ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిర్​ ఇండియా - ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఎందుకు

ఎయిర్​ ఇండియా సంస్థ టాటాల చేతికి చేరింది. టాటా సమర్పించిన బిడ్​కు ఆమోదం తెలిపినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనితో.. టాటాలు స్థాపించిన ఈ సంస్థ.. 68ఏళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకుంది. అసలు ఎయిర్​ఇండియాను ప్రభుత్వం విక్రయించాల్సిన అవసరమేంటి?

tata owns Airindia
టాటా చేతికి ఎయిర్​ఇండియా

By

Published : Oct 8, 2021, 4:26 PM IST

భారీ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియాను టాటా గ్రూప్​ సొంతం చేసుకుంది. ఇటీవల ముగిసిన బిడ్ల ప్రక్రియలో వివిధ సంస్థలు తమ బిడ్లను సమర్పించగా.. అందులో నుంచి టాటా గ్రూప్​ను ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

టాటా గ్రూప్​

ప్రైవేటికీరణ ఎందుకు?

దాదాపు 2007 నుంచి ఎయిర్​ఇండియా నష్టాల్లో నడుస్తోంది. ప్రభుత్వ నిధులతో సంస్థ కార్యకలాపాలు నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. యూపీఏ ప్రభుత్వం రెండవ సారి గెలిచిన తర్వాత ఎయిర్​ఇండియాకు దాదాపు రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించింది. అయినప్పటికీ.. సంక్షోభం నుంచి తేరుకోలేదు సంస్థ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆయిల్​ మార్కెటింగ్ సంస్థలకు.. ఏటీఎఫ్​ (విమానాల్లో వాడే ఇంధనం) కొనుగోలు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ప్రభుత్వ అండదండలతోనే ఎయిర్​ఇండియా గత కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 మార్చి చివరి నాటికే సంస్థకు రూ.60 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు అంచనా.

తొలి ప్రయత్నం విఫలం..

అయితే ఈ పరిస్థిని నుంచి గట్టెక్కేందుకు ఏకైక మార్గం.. సంస్థను ప్రైవేటికరించడమేనని ప్రభుత్వం భావించింది. ఆ దిశగా 2017లో తొలి అడుగు వేసింది. 76 శాతం వాటాను ప్రైవేటు సంస్థల చేతికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు. దీనితో తొలి ప్రయత్నం విఫలమైంది.

కరోనా కారణంగా ఆలస్యం..

మరోసారి 2019లో ఎయిర్​ఇండియాను విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించిం. అయితే ఈ సారి 100 శాతం వాటాను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చిలోపు ఈ ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా సహా వివిధ కారణాలతో అనుకున్న సమయానికి ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే ప్రైవేటీకరణ కసరత్తు మాత్రం కొనసాగిస్తూ వచ్చింది కేంద్రం.

ఈ సారి కూడా ప్రైవేటీకరణ పూర్తవకుంటే.. సంస్థను మూసేయడం తప్ప తమ ముందు వేరే మార్గం లేదని ప్రభుత్వం ఓ దశలో స్పష్టం చేసింది.

అప్పుల బదిలీ..

రెండో ప్రయత్నంలో కూడా అప్పుల భారం వల్ల ప్రైవేటు సంస్థలు ఎయిర్​ఇండియా కొనుగోలుకు ముందుకు రావనే భావనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

2019 మార్చి 31 నాటికి ఎయిర్​ఇండియాకు రూ.58,255 కోట్ల మేర అప్పులు ఉండగా.. అందులో రూ.29,464 కోట్లను ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఎయిర్​ఇండియా అస్సెట్‌ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు బదిలీ చేసింది కేంద్రం. బిడ్డింగ్ ప్రక్రియ గడువును కూడా పలుమార్లు పెంచింది. దీనితో పాటు అప్పులు ఎప్పటి వరకు చెల్లిస్తారో కొనుగోలు సంస్థనే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.

ఆసక్తివ్యక్తీకరణ బిడ్​..

ఎయిర్​ఇండియాను కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రైవేటు కంపెనీల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకకరణ ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లను ఆహ్వానించగా.. ఎయిర్​ఇండియా, స్పైస్​జెట్​ సహా వివిధ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయి. సంస్థ ఉద్యోగులు కూడా 209 మంది బృందంగా ఏర్పడి.. ఓ ఫినాన్షియర్ భాగస్వామ్యంతో బిడ్​ను సమర్పించారు. కానీ తదుపరి ప్రక్రియకు ఈ గ్రూప్ ఎంపిక కాలేదు.

చివరి రోజు టాటా ఫినాన్షియల్ బిడ్​..

ప్రభుత్వంతో చర్చలు, వివిధ పరిణామాల అనంతరం ఫినాన్షియల్ బిడ్లు సమర్పించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్​ 15న తుది గడువుగా నిర్ణయించింది కేంద్రం. చివరి తేదీనే టాటా సహా మరికొన్ని సంస్థలు ఫినాన్షియల్ బిడ్లను సమర్పించాయి. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత టాటాల వైపై ప్రభఉత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కొనుగోలు సంస్థ ఆధీనంలోకి

ఎయిర్ ఇండియాకు సంబంధించిన 4,400 దేశీయ, 18 వందల అంతర్జాతీయ ల్యాండింగ్​, పార్కింగ్ స్లాట్లు, విదేశాల్లోని 900 స్లాట్లు.. కొనుగోలు చేసిన సంస్థ ఆధీనంలోకి వెళతాయి. దీంతోపాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వంద శాతం కార్గో సేవలు తక్కువ ధరకే ఆ సంస్థకు అందుతాయి.

టాటా ఎయిర్​ విమానం

టాటా- ఎయిర్​ఇండియా బంధం పాతదే..

భారత్​కు స్వాతంత్ర్యం రాకముందే.. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్​డీ టాటా.. 1932 'టాటా ఎయిర్​లైన్స్' పేరుతో విమానయాన సంస్థను నెలకొల్పారు.1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. తిరిగి 68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ వారి చేతుల్లోకే వెళ్లనుండడం ఖాయంగా కనిపిస్తోంది! అంతా సవ్యంగా సాగితే డిసెంబరు నాటికి ఎయిర్​ ఇండియాలో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఎయిర్​ ఇండియా కొత్త యజమాని చేతుల్లోకి వెళ్లిపోతుంది.

జె.ఆర్​.డి టాటా

టాటా గురించి..

టాటా గ్రూప్​ ప్రస్తావన లేకుండా భారత పారిశ్రామిక రంగం గురించి చెప్పడం అసాధ్యమనే చెప్పాలి. ఫుడ్​, సాఫ్ట్​వేర్, ఆటోమొబైల్​, టెలికాం సహా దాదాపు అన్ని రంగాల్లో టాటా గ్రూప్​ వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ ఎయిర్ ఏషియా, విస్తారా వంటి విమానయాన సంస్థల్లో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. ఇప్పుడు ఎయిర్​ ఇండియా కూడా టాటాల చెతికి రావడం వల్ల.. దేశీయ ఏవిషయేషన్ మార్కెట్​లో టాటాలు కీలకం కానున్నారు.

విస్తారా ఎయిర్​లైన్స్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details