తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా X మిస్త్రీ కేసు: నేడు సుప్రీం తీర్పు

టాటా సన్స్​-సైరస్​​ మిస్త్రీ వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించనుంది. జాతీయ కంపెనీ లా అప్పీలేట్​ ట్రైబ్యునల్​(ఎన్​సీఎల్​ఏటీ) ఉత్తర్వులపై.. ఇరు పక్షాలు చేసిన పరస్పర అప్పీళ్లపై.. జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనుంది.

SC to deliver judgement in Tata-Mistry case on Friday
టాటా-మిస్త్రీ కేసులో సుప్రీం తీర్పు నేడే

By

Published : Mar 26, 2021, 7:26 AM IST

Updated : Mar 26, 2021, 8:20 AM IST

జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ) ఉత్తర్వులపై.. టాటా సన్స్​, సైరస్​​ మిస్త్రీ దాఖలు చేసిన పరస్పర​ అప్పీళ్లపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా తిరిగి నియమిస్తూ జారీ చేసిన ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలపై టాటాసన్స్‌, సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పరస్పరం పిటిషన్లు వేశాయి. నాడు విచారణ చేపట్టిన జస్టిస్​ ఎస్​ఏ బోపన్న, జస్టిస్​ వీ రామ సుబ్రమణియన్​లతో కూడిన ధర్మాసనం.. గతేడాది డిసెంబర్​ 17న ఈ తీర్పును రిజర్వు చేసింది.

ఇదీ చదవండి:టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే

వాదనలు ఇలా..

2016 అక్టోబర్​లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించడం కంపెనీల చట్ట నిబంధనలను, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ను ఉల్లంఘించడమేనని షాపూర్జీ పల్లోంజీ(ఎస్‌పీ) గ్రూప్‌.. డిసెంబర్​ 17న కోర్టుకు తెలిపింది. అయితే.. మిస్త్రీని తొలగించడం తమ హక్కులకు లోబడే జరిగిందని.. ఈ విషయంలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని టాటా సన్స్‌ సమర్థించుకుంది.

ఈ కేసులో గతేడాది జనవరి 10న సుప్రీం కోర్టులో టాటా సన్స్​కు ఉపశమనం లభించింది. 2019 డిసెంబరు 18న మిస్త్రీని తిరిగి కార్య నిర్వాహక ఛైర్మన్‌గా నియమిస్తూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

వివాదం ఏమిటంటే..

రతన్​ టాటా తర్వాత టాటా సన్స్​ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీ 2012లో నియమితులయ్యారు. కానీ నాలుగేళ్ల తర్వాత అంతర్గత విభేదాల వల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించి.. రతన్ టాటా తాత్కాలికంగా ఆ బాధ్యతలు స్వీకరించారు. దీనితో తనను పదవి నుంచి తప్పించడాన్ని సవాలు చేస్తూ.. మిస్త్రీ కోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి: 'ఇక నుంచి డ్రైవింగ్​ టెస్ట్​ మరింత కఠినం
'

Last Updated : Mar 26, 2021, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details