నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో దేశీయ టెలికాం సంస్థలన్నీ(Telecom news) జట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తానని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్(Sunil Mittal news) పేర్కొన్నారు. ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగం(Telecom sector) కోసం ప్రభుత్వం బుధవారం పలు సంస్కరణలను ప్రకటించిన మరుసటి రోజే మిత్తల్ ఈ విధంగా స్పందించారు. బుధవారమే వొడాఫోన్ అధిపతి నిక్ రీడ్‌తో మాట్లాడానని.. త్వరలోనే రిలయన్స్ జియో ఛైర్మన్ ముకేశ్ అంబానీతోనూ(Mukesh Ambani) చర్చిస్తానని పేర్కొన్నారు. దేశంలోని ఇతర మౌలిక కంపెనీలకు టెలికాం సంస్థలు(Telecom news) ఆదర్శంగా నిలిచేలా చేస్తామని గురువారం జరిగిన దృశ్యమాధ్యమ సమావేశంలో పేర్కొన్నారు. ఇలా ఉన్నంతమాత్రాన కంపెనీలు కుమ్మక్కయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. జియో తీసుకురాబోయే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌కు(Jio Smartphone price) పోటీగా హ్యాండ్‌సెట్ తయారీదార్లతో భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్న వార్తలపై స్పందిస్తూ.."అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్ తీసుకురావాల్సిన అవసరం వస్తే అందుకు తాము సిద్ధంగానే ఉన్నాం" అని తెలిపారు.
టెలికాం రంగం బాగుండటమే ధ్యేయం
"టెలికాం పరిశ్రమ(Telecom news) ఆర్థికస్థితి మెరుగుపడేలా చర్చలు జరుపుతాం. పంపిణీ వ్యవస్థపై మాట్లాడుకుంటాం. అంతేకానీ టారిఫ్‌లపై కాదు. వేరే కంపెనీ కంటే మా మార్కెట్ వాటా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నపుడు, టారిఫ్‌లపై చర్చ ఎలా జరుపుతాం. వినియోగదార్లకు సేవలందించడంలో మా మధ్య పోటీ కొనసాగుతుంది" అని అన్నారు.