గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సుందర్ పిచాయ్‌కి భారీగా పారితోషికం పెరిగింది. ఆయనకి రెండు మిలియన్ డాలర్ల వార్షిక వేతనంతో సహా, సంతృప్తికరమైన పనితీరుతో లక్ష్యాలను చేరుకోగలిగితే 2020 నుంచి మూడు సంవత్సరాల పాటు 240 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.17,07,07,20,000) విలువ చేసే స్టాక్ అవార్డు లభించనుంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్ డాలర్ల విలువగల షేర్లు అదనపు బోనస్‌గా లభించనున్నాయి.
ఈ విధంగా పనితీరును బట్టి షేర్లను బోనస్‌గా ఇవ్వటం ఆల్ఫాబెట్ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. లారీ పేజ్ నిష్క్రమణ అనంతరం డిసెంబర్ 3న పిచాయ్ ఆల్ఫాబెట్ పగ్గాలు చేపట్టారు. అయితే మాజీ అధ్యక్షులు, గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్‌లకు గూగుల్‌లో 6 శాతం వాటాలుండగా సుందర్‌కు ఆ రూపంలో పరిహారం ఏమీ లభించలేదు.
ఉద్యోగి అభ్యంతరం..