దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ఇండస్ట్రీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికానికి గానూ రూ.1,444.17 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1,655.60 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది సన్ ఫార్మా.
2021-22 క్యూ1లో సంస్థ ఆదాయం కూడా రూ.9,718.74 కోట్లకు పెరిగింది. 2020-21లో ఇదే సమయంలో ఈ మొత్తం రూ.7,585.25 కోట్లుగా ఉంది.