తెలంగాణ

telangana

ETV Bharat / business

తక్కువ ధరకే మార్కెట్లోకి ఫావిపిరవిర్​ ట్యాబ్లెట్లు - ఫావిపిరవిర్ ఔషధం ధర

దేశీయ మార్కెట్లోకి చౌక ధరలో కరోనా ఔషధాన్ని విడుదల చేసింది సన్​ఫార్మా. స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలున్న కరోనా బాధితులు వాడేందుకు అనుమతి ఉన్న ఫావిపిరవిర్​ ఔషధాన్ని 'ఫ్లూగార్డ్​' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఫ్లూగార్డ్ మాత్ర ధర రూ.35గా నిర్ణయించింది.

Sun Pharma launches Favipiravir
సన్​ఫార్మా నుంచి తక్కువ ధరకే కరోనా ఔషధం

By

Published : Aug 4, 2020, 5:03 PM IST

ఫార్మా ఔషధ దిగ్గజం సన్​ఫార్మా.. దేశీయ మార్కెట్​లో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలున్న కరోనా బాధితులకు వాడే.. ఫావిపిరవిర్‌​ ఔషధాన్ని విడుదల చేసింది. 'ఫ్లూగార్డ్' పేరుతో ఈ వారం నుంచే మార్కెట్లో ఔషధం లభిస్తుందని సన్​ఫార్మా వెల్లడించింది. 200 ఎంజీ పరిమాణంలోని ఒక్కో మాత్ర ధర రూ.35గా నిర్ణయించింది.

స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న కరోనా బాధితులు వాడేందుకు దేశంలో అనుమతి ఉన్న ఔషధం ఫావిపిరవిర్‌ ఒక్కటే.

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన వారందరికి 'ఫ్లూగార్డ్' ఔషధం అందుబాటులో ఉండేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సన్​ఫార్మా వెల్లడించింది. అందుకే తక్కువ ధరకు ఈ ఔషధాన్ని విక్రయించాలని నిర్ణయించినట్లు వివరించింది.

మరో ఫార్మా సంస్థ గ్లెన్​మార్క్​ ఫావిపిరవిర్‌​ను గత నెలలోనే 'ఫ్యాబిఫ్లూ' పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. అయితే గ్లెన్​మార్క్​ ఒక్కో ఫావిపిరవిర్‌ మాత్రను తొలుత రూ.103కు విక్రయించింది. ఆ తర్వాత రూ.75కు ధర తగ్గించింది.

ఇదీ చూడండి:వ్యవసాయ రంగం అండతోనే కరోనా సంక్షోభం దూరం!

ABOUT THE AUTHOR

...view details