వాణిజ్య యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తిస్తున్నాయి.బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 100 పాయింట్లు కోల్పోయి.. 37,700 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల నష్టానికి 11,320 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
ఇవీ కారణాలు
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెర దించే దిశగా 11వ దశ చర్చలు నేటి నుంచి రెండ్రోజులు జరగనున్నట్లు అధికారికంగా తేలింది. వాషింగ్టన్లో జరుగనున్న ఈ చర్చలు కీలకంగా మారాయి.
తమ వస్తువులపై అమెరికా సుంకాల పెంపు అనివార్యమైతే.. తాము కూడా దీటుగా సమాధానమిస్తామని చైనా హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య చర్చలు ఏమేరకు సఫలం అవుతాయోనన్న అనుమానాల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోతే స్టాక్ మార్కెట్లకు మరిన్ని నష్టాలు తప్పవంటున్నారు నిపుణులు.