మిడ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నప్పటికీ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రికార్డు స్థాయిలు నుంచి వెనక్కి తగ్గాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 214 పాయింట్ల లాభంతో ప్రస్తుతం 39, 324 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 11,811 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.