తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫలితాల ముందు సానుకూల ముగింపు..

అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్​ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 140 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 29 పాయింట్లు బలపడింది.

By

Published : May 22, 2019, 4:05 PM IST

స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వంపై అంచనాలతో నేడు ఆచితూచి వ్యవహరించారు మదుపరులు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 140 పాయింట్లు బలపడింది. చివరకు 39,110 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 29 పాయింట్లు వృద్ధి చెందింది. 11,734 వద్ద సెషన్ ముగించింది.

ఇంట్రాడే సాగిందిలా...

సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,904-39,249 పాయింట్ల మధ్య కదలాడింది. నిఫ్టీ నేడు 11,785 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 11,682 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాల్లోనివివే..

ఇండస్​ఇండ్​ బ్యాంకు 4.84 శాతం, సన్ ఫార్మా 3.46 శాతం, బజాజ్ ఆటో 2.29 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 1.83 శాతం, కోల్ ఇండియా 1.77 శాతం, టాటా మోటార్స్​ 1.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.44 శాతం లాభాలను ఆర్జించాయి.

ఎస్​ బ్యాంకు 2.34 శాతం, ఐటీసీ 1.74 శాతం, టీసీఎస్​ 1.25 శాతం, పవర్ గ్రిడ్ 1.03 శాతం, హెచ్​యూఎల్ 0.65 శాతం నష్టాలను నమోదుచేశాయి.

రూపాయి, ముడి చమురు

నేటి ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.68కి చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.64 శాతం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడి చమురు ధర 71.72 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండీ: హిందుజా ఆసక్తితో దూసుకెళ్తున్న జెట్​ షేర్లు

ABOUT THE AUTHOR

...view details