తెలంగాణ

telangana

By

Published : May 10, 2019, 4:06 PM IST

Updated : May 10, 2019, 4:59 PM IST

ETV Bharat / business

నష్టాల వారం... టాటా స్టీల్​ పతనం

అమెరికా చైనా వాణిజ్య భయాలతో వారంలో చివరి సెషన్​లోనూ నిరాశే మిగిల్చాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 96 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించింది. 11వేల 300 మార్కుకు దిగువకు పతనమైంది.

వారాంతంలోనూ నిరాశే

స్టాక్ మార్కెట్లు వరుసగా 8వ సెషన్​లో నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 96 పాయింట్ల నష్టంతో 37,463 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 23 పాయింట్ల నష్టానికి 11,279 వద్ద ట్రేడింగ్​ ముగించింది.

ఇవీ కారణాలు

ట్రంప్​ అన్నట్లుగానే ఈ ఉదయం 200 బిలియన్​ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలు 10 నుంచి 25 శాతానికి పెంచింది అమెరికా. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేసింది.

వాణిజ్య చర్చలపై అంచనాలు, దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరడం, పెరిగిన ముడి చమురు ధరలు నేటి నష్టాలకు కారణం.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ నేటి ట్రేడింగ్​లో 37,721.98 పాయింట్ల గరిష్ఠం నుంచి 37,370.39 పాయింట్ల కనిష్ఠాల మధ్య కదలాడింది. నిఫ్టీ 11,345.80 పాయింట్ల గరిష్ఠాన్ని.. 11,251.05 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభనష్టాలు

క్యూ4 ఫలితాల ఊతంతో ఎస్​బీఐ 2.94 శాతం లాభపడింది. భారతీ ఎయిర్​టెల్​ 2.09 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.88 శాతం, హెచ్​డీఎఫ్​సీ 0.54 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.25 శాతం, కోటక్ బ్యాంకు 0.22 శాతం లాభాలు నమోదు చేశాయి.

టాటా స్టీల్ అత్యధికంగా 6.10 శాతం నష్టాన్ని నమోదు చేసింది. జర్మన్​ దిగ్గజం థైసెంక్రూప్​ సంస్థను టాటా స్టీల్​లో విలీనం చేయాలన్న ప్రణాళికను యూరోపియన్​ కమిషన్​ అడ్డుకుందన్న వార్తలు ఇందుకు కారణం.

హెచ్​సీఎల్​టెక్​ 4.07 శాతం, యస్ బ్యాంకు 3.70 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంకు 2.44 శాతం, ఓఎన్​జీసీ 1.74 శాతం, బజాజ్ 1.63 శాతం నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు ఇలా

వాణిజ్య యుద్ధ భయాలకు వ్యతిరేకంగా ఆసియాలో ఇతర ప్రధాన సూచీలైన చైనా సూచీ అత్యధికంగా 3.10 శాతం, హాంకాంగ్​ సూచీ-హాంగ్​ సెంగ్​ 0.84 శాతం లాభాలను నమోదు చేశాయి. జపాన్ సూచీ-నిక్కీ 0.27 శాతం నష్టపోయింది.

ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేండింగ్​ ప్రారంభించాయి.

రూపాయి, ముడి చమురు

సెషన్​ ముగింపు ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.86కు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.38 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 70.66 డాలర్లుగా నమోదైంది.

Last Updated : May 10, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details