అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా.. ఇరాన్ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో చమురు భయాలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 65 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 41,561 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 12,252 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
రిలయన్స్, ఓఎన్జీసీ, ఎస్ బ్యాంకు, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, మారుతీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.