స్టాక్ మార్కెట్లు ఆరంభంలో లాభాలతో ప్రారంభమైనా.. మదుపరుల అప్రమత్తతతో కొద్దిసేపటికే సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి.
డిసెంబర్ డెరివేటివ్స్ గడువు ముగింపు దగ్గరపడుతుండటం ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. విదేశీ మదుపరులు సంవత్సరాంతపు సెలవుల్లో గడుపుతుండటమూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతున్నట్లు స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 2 పాయింట్ల లాభంతో.. ప్రస్తుతం 41,463 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 2 పాయింట్లకు పైగా క్షీణించి.. 12,212 వద్ద కొనసాగుతోంది.