తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్దీపనల ప్రభావంతో దూసుకెళ్తున్న సూచీలు - లాభాలు

స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 85 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుంది. గత సెషన్​లో నమోదైన భారీ లాభాలతో మదుపరులు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా ఆ ప్రభావం మార్కెట్లపై అంతగా లేదు.

స్టాక్ మార్కెట్లు

By

Published : Aug 27, 2019, 10:29 AM IST

Updated : Sep 28, 2019, 10:38 AM IST

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వృద్ధికి ఊతమందించే దిశగా కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలతో గత సెషన్​లో భారీ లాభాలు నమోదయ్యాయి. వీటికి తోడు కేంద్రానికి భారీగా నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రోత్సాహకాలు ఉండొచ్చని మార్కెట్​ వర్గాల్లో అంచనాలు పెరిగాయి.
బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 121 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 37, 615 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,100 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

టాటా మోటార్స్, ఎస్​బీఐ, ఎల్​&డీ, టాటా స్టీల్, ఎన్​టీపీసీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్​, టీసీఎస్, టెక్​ మహీంద్రా, కోటక్ బ్యాంకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: విమానాల్లో ఈ 'యాపిల్'​ ల్యాప్​​టాప్​లపై ​నిషేధం

Last Updated : Sep 28, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details