తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలతో నష్టం- కుదేలైన ఎస్​ బ్యాంక్

ఆర్థిక వృద్ధి మందగమనం భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 229 పాయింట్లు క్షీణించింది. నిప్టీ 73 పాయింట్లు కోల్పోయింది. ఎస్​ బ్యాంక్​ షేర్లు అత్యధికంగా 6 శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేశాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Nov 13, 2019, 4:12 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంకేతంగా సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. వీటికి తోడు ఎస్​బీఐ ఇటీవల విడుదల చేసిన సర్వేలో 2019-20 జీడీపీ 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 229 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,116 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి..11,840 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,447 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,016 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,947 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,823 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​ 3.76 శాతం, రిలయన్స్ 3.10 శాతం, హెచ్​యూఎల్ 0.63 శాతం, మారుతీ 0.31 శాతం, ఎన్​టీపీసీ 0.04 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ఎస్​ బ్యాంక్​ 6.51 శాతం, ఎస్​బీఐ 3.69 శాతం, యాక్సిస్​ బ్యాంక్​ 3.18 శాతం, వేదాంత 2.82 శాతం, సన్​ఫార్మా 2.34 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: ఇకపై ఫేస్​బుక్​లోనూ ఆన్​లైన్​ చెల్లింపులు!

ABOUT THE AUTHOR

...view details