స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. డివిడెండ్ పంపిణీ సుంకం (డీడీటీ) రద్దు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ), స్వల్పకాలిక మూలధన లాభాలపై సుంకం(ఎస్టీసీజీ) సహా పలు ఇతర సుంకాలను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్న వార్తలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. వృద్ధికి ఊతమందించే దిశగా ఈ ప్రోత్సాహకాలు ఇస్తుందన్న అంచనాలతో భారీగా కొనుగోళ్లు జరపడం నేటి లాభాలకు ప్రధాన కారణం.
వీటికి తోడు టెలికాం రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం.. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రకటనతో టెలికాం షేర్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. నేటి లాభాలకు ఇదీ ఓ కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 220 పాయింట్లు బలపడింది. చివరకు 40,052 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 57 పాయింట్లు వృద్ధి చెంది..11,844 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..