తెలంగాణ

telangana

ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​లో బుల్​ జోరు.. కొత్త శిఖరాలకు సూచీలు - స్టాక్ మార్కెట్ల జోరు

విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్​ ఏకంగా 413 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 111 పాయింట్లు వృద్ధి చెందింది. రెండు సూచీలు నేడు కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 17, 2019, 3:59 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త శిఖరాలను తాకాయి. అమెరికా-చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదరటం సహా అంతర్జాతీయంగా ఇతర సానుకూలతలతో.. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగటం నేటి లాభాలకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 413 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 41,352 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో తిరిగి 12,165 (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,402 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 41,005 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,183 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం).. 12,070 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్​ 4.38 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 4.37 శాతం, వేదాంత 3.50 శాతం, టాటా మోటార్స్ 3.03 శాతం, బజాజ్​ ఫినాన్స్ 2.56 శాతం, హెచ్​డీఎఫ్​సీ 2.30 శాతం లాభాలను నమోదు చేశాయి.

సన్​ ఫార్మా 1.37 శాతం, ఎం&ఎం 0.63 శాతం, బజాజ్​ ఆటో 0.56 శాతం, హెచ్​యూఎల్​ 0.35 శాతం, రిలయన్స్ 0.28 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.24 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:భారత మార్కెట్లోకి రియల్​మీ ఇయర్​బడ్స్​, ఎక్స్​2 స్మార్ట్​ఫోన్​

ABOUT THE AUTHOR

...view details