తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్​కు మరో షాక్​- స్టార్​బక్స్ యాడ్స్​ బంద్ - ఫేస్​బుక్​లో ప్రకటనలకు కంపెనీల నిరాకరణ

బాయ్​కాట్ ఫేస్​బుక్ పేరుతో ప్రకటనలు ఉపసంహరించుకుంటున్న కంపెనీల జాబితాలో స్టార్​బక్స్​ చేరింది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఫేస్​బుక్​, ట్విట్టర్​ షేర్లు ఇటీవల భారీగా కుదేలయ్యాయి.

Starbucks pause social media ads
ఫేస్​బుక్ ప్రకటనలకు స్టార్​బక్స్ గుడ్​బై

By

Published : Jun 29, 2020, 12:19 PM IST

సామాజిక మాధ్యమాలకు ప్రకటనల నిలిపివేస్తున్న కంపెనీల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ కాఫీ గొలుసుకట్టు వ్యాపార సంస్థ స్టార్​బక్స్ ఈ చిట్టాలో చేరింది.

ఇప్పటికే యునీలీవర్​, కోకో కోలా, సెల్​ఫోన్​ కంపెనీ వెరిజోన్​, లివైస్, మాగ్నోలియ పిక్చర్స్ సహా డజనుకు పైగా చిన్న కంపెనీలు ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ప్రకటనలు ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించాయి. మరిన్ని సంస్థలు ప్రకటనల వ్యయాలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రకటనల నిలిపివేత ఎందుకు?

విద్వేషపూరిత, జాత్యహంకార ప్రసంగాలకు సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారతున్నాయని ఇటీవల విమర్శలు వస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాలు సరైన చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో ప్రకటనల నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ సంస్థలు.

తాము తీసుకున్న ఈ నిర్ణయం #StopHateforProfit పేరుతో జరుగుతున్న ప్రచారంలో భాగం మాత్రమే కాదని వెల్లడించింది స్టార్​బక్స్. విద్వేషపూరిత ప్రసంగాలను ఎలా అడ్డుకోవాలి అనే అంశంపై పౌర హక్కుల సంఘాలు, మీడియా భాగస్వాములతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:కొలువులపై కరోనా దెబ్బ- కూలి పనుల్లో యువత

ABOUT THE AUTHOR

...view details