తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యాక్సిన్ రవాణాకు స్పైస్​జెట్, జీఎంఆర్​ ఒప్పందం

దేశీయ, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ రవాణా కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​.. జీఎంఆర్​తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్పైస్​జెట్​కు వ్యాక్సిన్ పంపిణీ సామర్థ్యం పెరగనుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్​ ఎయిర్​కార్గొ చేయనుంది.

SpiceJet ties up with GMR For COVID-19 vaccine delivery
వ్యాక్సిన్ పంపిణీకి జీఎంఆర్​తో స్పైస్​జెట్ ఒప్పందం

By

Published : Dec 24, 2020, 5:22 PM IST

వ్యాక్సిన్ తయారీదారులకు నిరంతరాయంగా సేవలందించేందుకు ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్​జెట్ జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్​కార్గొ (జీహెచ్​ఏసీ)తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో స్పైస్​జెట్​కు చెందిన కార్గొ సేవల విభాగం స్పైస్​ ఎక్స్​ప్రెస్ వ్యాక్సిన్​ను వేగంగా రవాణా చేసేందుకు అవాకాశం దొరకుతుంది. దీనితో పాటే స్థిరమైన కోల్డ్​ చైన్​ నెట్​వర్క్​ను కూడా ఏర్పాటు చేయనుంది స్పైస్​జెట్.

వ్యాక్సిన్​ను లోడ్ చేసినప్పటి నుంచి డెలవరీ చేసే వరకు.. అన్ని దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు నియంత్రిత ఉష్ణోగ్రతలో (వ్యాక్సిన్​ సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన ఉష్టోగ్రత) రవాణా చేయడమే తమ లక్ష్యమని స్పైస్​ జెట్ పేర్కొంది.

స్పైస్​ జెట్ విమానాలకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉంచడం సహా.. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా స్పందించేందుకు తమ సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనుంది.

ఇదీ చూడండి:వరుసగా 15వ ఏటా టీవీల రారాజుగా శాంసంగ్!

ABOUT THE AUTHOR

...view details