తెలంగాణ

telangana

ETV Bharat / business

స్పైస్​జెట్​లోకి 500 మంది జెట్​ ఉద్యోగులు - జెట్​ఎయిర్​వేస్​

జెట్​ఎయిర్​వేస్​కు చెందిన 500 మంది ఉద్యోగులను సంస్థలోకి తీసుకున్నట్లు స్పైస్​జెట్​ ప్రకటించింది. అందులో 100 మంది పైలెట్లు ఉన్నారని తెలిపింది. రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మరింత నియమించుకుంటామని పేర్కొంది.

స్పైస్​జెట్​లోకి 500 మంది జెట్​ ఉద్యోగులు

By

Published : Apr 20, 2019, 5:11 AM IST

Updated : Apr 20, 2019, 7:02 AM IST

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తాత్కాలికంగా మూతపడిన జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. ఆ సంస్థకు చెందిన 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు స్పైస్​జెట్​ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత మందిని సంస్థలోకి తీసుకుంటామని తెలిపింది.

జెట్​ ఎయిర్​వేస్​ తాత్కాలిక మూసివేతతో ఏర్పడిన సామర్థ్య లోటును తీర్చేందుకు స్పైస్​జెట్​ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 27 అదనపు విమానాలను తన శ్రేణిలో చేర్చింది స్పైస్​జెట్​. నియామకాల్లో జెట్​ ఎయిర్​వేస్​ ఉద్యోగులకే తొలి ప్రాధాన్యమని స్పైస్​జెట్​ ఛైర్మన్​, ఎండీ అజయ్​ సింగ్​ ఇప్పటికే ప్రకటించారు.

" మా సంస్థ విస్తరణలో భాగంగా అవసరాలు పెరుగుతాయి. అనుకోకుండా జెట్​ ఎయిర్​వేస్​ మూతపడటం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికే మా మొదటి ప్రాధాన్యత. స్పైస్​జెట్​ ఇప్పటికే 100కు పైగా పైలెట్లు, 200కు పైగా క్యాబిన్​ సిబ్బంది, 200కుపైగా సాంకేతిక, విమానాశ్రయ సిబ్బందిని నియమించుకుంది. మా సంస్థను మరింత వృద్ధి చేస్తాం. ఇందుకు పెద్ద సంఖ్యలో విమానాలను తీసుకురాబోతున్నాం. " - అజయ్​ సింగ్​, స్పైస్​జెట్​ ఛైర్మన్​, ఎండీ

ముంబయి-దిల్లీ మధ్య 24 కొత్త విమాన సర్వీసుల సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది స్పైస్​జెట్​. ఈ నెల చివర లేదా మే మొదటి వారంలో ఈ సేవలు ప్రారంభించే అవకాశముంది.

ఇదీ చూడండి: 'బెల్​ఫాస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్​'లో ఆమిర్ ఖాన్

Last Updated : Apr 20, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details