తెలంగాణ

telangana

ETV Bharat / business

సబ్బుల ధరలు భారీగా తగ్గింపు... కారణమిదే! - హెచ్​యూఎల్​

కొంత కాలంగా అమ్మకాలు తగ్గడం కారణంగా ప్రముఖ సబ్బు తయారీ సంస్థలు వాటి ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నాయి. లక్స్, సంతూర్​, లైఫ్​ బాయ్​ వంటి సబ్బులపై ఇప్పటికే తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చాయి.

సబ్బుల ధరలు భారీగా తగ్గింపు..కారణమిదే!

By

Published : Aug 29, 2019, 8:14 AM IST

Updated : Sep 28, 2019, 4:55 PM IST

దేశంలోని అగ్రగామి సబ్బు తయారీ కంపెనీలు వాటి ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నాయి. అమ్మకాలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రముఖ సబ్బు బ్రాండ్లు లక్స్, లైఫ్​బాయ్​లపై గతనెలలోనే ధరలు తగ్గించింది హిందూస్థాన్​ యూనిలివర్​ సంస్థ.

"కొంత కాలంగా ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ కారణంగా లక్స్, లైఫ్​బాయ్​ సబ్బుల ధరలపై 4-6 శాతం కోత విధించాం. కొన్ని ప్యాక్​లపై అదనపు తగ్గింపునూ ఇస్తున్నాం." -హెచ్​యూఎల్​

సంతూర్​ సబ్బుల ధరలపైనా ఇదే నిర్ణయం తీసుకుంది తయారీ సంస్థ 'విప్రో కన్జూమర్​ కేర్​'.

"ముడి సరుకుల ధరల సానుకూలతల ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు.. సబ్బుల ధరలు తగ్గించాం. ఇది అమ్మకాలు పెరిగేందుకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం." -అనిల్​ ఛుగ్​, విప్రో కన్జూమర్​ కేర్​ అధ్యక్షుడు

మరో ప్రముఖ సంస్థ 'ఐటీసీ' తమ సబ్బు ఉత్పత్తులపై ధరలు తగ్గించింది. గత నెల నుంచి ఈ సంస్థ కొన్ని ప్యాక్​లను ప్రత్యేక తగ్గింపుతో విక్రయిస్తోంది.

ఇదీ చూడండి: 2019-20లో జీడీపీ వృద్ధి 6.7 శాతమే!

Last Updated : Sep 28, 2019, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details