తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ తర్వాత పుంజుకున్న స్మార్ట్​ ఫోన్​ విక్రయాలు - ఇండియన్​ మార్కెట్​లో స్మార్ట్​ ఫోన్స్​

లాక్‌డౌన్‌ తర్వాత స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గాడినపడ్డాయని కౌంటర్​ పాయింట్​ సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 5 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు జరిగాయని తెలిపింది. అమ్మకాల్లో శాంసంగ్‌ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నట్లు చెప్పింది.

smart phones sales are increased after lock down said by counter point
లాక్​డౌన్​ తర్వాత పుంజుకున్న స్మార్ట్​ ఫోన్​ విక్రయాలు

By

Published : Oct 29, 2020, 5:04 AM IST

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు తిరిగి పుంజుకున్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 5.30 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడైనట్లు.. కౌంటర్‌ పాయింట్ సంస్థ వెల్లడించింది.

  • 24 శాతం అమ్మకాలతో శాంసంగ్‌ తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా... 23 శాతంతో షియోమీ రెండో స్థానంలో నిలిచింది.
  • వివో 16, రియల్‌మీ 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • 32 శాతం సంవత్సర వృద్ధితో రెండేళ్ల అనంతరం శాంసంగ్‌ తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

రెడ్‌ మీ 9, నోట్‌ 9 లకు అధిక డిమాండ్ ఉందన్న కౌంటర్‌ పాయింట్‌..వచ్చే త్రైమాసికంలో రెడ్‌ మీ అమ్మకాలు పెరుగవచ్చని నివేదించింది. కొవిడ్‌ సంక్షోభంతో సరఫరా గొలుసు దెబ్బతినగా తయారీకి అడ్డంకి ఏర్పడిందని పేర్కొంది. ఆన్‌లైన్‌ ద్వారా ఫోన్ల అమ్మకాలు పెరిగినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:అలాగైతే 5జీ వేలంలో పాల్గొనం: ఎయిర్‌టెల్‌

ABOUT THE AUTHOR

...view details