కరోనా విజృంభణతో దారుణంగా పతనమైన రంగాల్లో... విమానయానం కూడా ముఖ్యమైంది. కరోనా సంక్షోభం నుంచి తేరుకునేందుకు ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ చేరింది.
ఈ సంస్థ తమ ఉద్యోగుల్లో 4,300 మందిని విధుల నుంచి తప్పించనున్నట్లు పేర్కొంది. కొవిడ్ తర్వాత విమానయాన రంగం గాడిన పడేందుకు చాలా సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
సింగపూర్ ఎయిర్లైన్స్ సహా దాని అనుబంధ సంస్థ సిల్క్ ఎయిర్, బడ్జెట్ విభాగం స్కూట్లలో కలిపి ఊ మేరకు కోతలు ఉండనున్నట్లు తెలిపింది.