రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం జియోలో ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ తన పెట్టుబడిని మరింత పెంచింది. ఇదివరకే జియోలో 1.15శాతం వాటా కైవసం చేసుకున్న సిల్వర్ లేక్.. తాజాగా రూ. 4,546.80 కోట్ల పెట్టుబడిని పెట్టింది.
ఫలితంగా జియోలో సిల్వర్ లేక్ మొత్తం పెట్టుబడి రూ. 10,205.55 కోట్లకు చేరగా.. వాటా 2.08శాతానికి పెరిగింది.
"అందుబాటు ధరలో నాణ్యమైన సేవలను పెద్ద ఎత్తున వినియోగదారులకు అందించే విధంగా జియో ప్లాట్‌ఫాంకు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది."